Skip to main content

Posts

Showing posts with the label health & wellness

పెయిన్ కిల్లర్స్ అతిగా వేస్కుంటున్నారా?

నాకు తెలిసిన ఒక మిత్రుడి సంగతి చెప్తాను. శ్రీను, ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది. ఒక స్కూల్ లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తుంటాడు. భార్య, అయిదారేళ్ళ కొడుకు. స్మాల్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ. నాకు తెలిసి శ్రీనుకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. చురుగ్గా ఉండేవాడు.తన పెర్శనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉండేది. ఒకటో రెండో సందర్భాల్లో తల నొప్పిగా ఉందంటూ పెయిన్ కిల్లర్ మాత్రలు టక్కున మింగడం చూశాను, తల నొప్పి ఎప్పటి నుంచి శ్రీను నీకు అని అడిగాను. ఈ మధ్య తరచూ వస్తోంది కళ్ల  ప్రాబ్లెమ్ ఏమో అని ఐ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను, సైట్ మామూలుగానే ఉంది అన్నాడు. మరి జాబ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉందా అన్నాను.. అలా ఏమి లేదే నేను చేసేది ఆర్ట్ టీచర్ జాబ్ అదీ కూడా చిన్న పిల్లలకి, అందులో స్ట్రెస్ ఏముంటుంది అన్నాడు. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. నేను ఆ తర్వాత పెద్దగా ఆ విషయం గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఇది రెండేళ్ల క్రితం మాట... మళ్ళీ మొన్నెపుడో కలిసినపు అడిగా తల నొప్పి మళ్ళీ వస్తోందా అని. చాలా సార్లు వచ్చింది. ఒక్కో సారి బైక్ మీద వెళ్ళేటపుడు బ్లాక్ అవుట్ అయిపోతుంది అని చెప్పాడు. మరో పెద్ద బాంబు లాంటి నిజాన్ని కూడా చెప్పాడు....

చేసిన పనినే పదే పదే చేస్తున్నారా? ఒకే ఆలోచన మనసుని వేధిస్తోందా ?

తాళం వేసి అది సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసే వాళ్ళని చూసారా? లేదంటే తాళం వేసి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తాళం లాగి చూసే వాళ్ళని? రోజుకు పదులు ఇరవైల సార్లు చేతులు కాళ్ళు కడుక్కోనే వాళ్లని? ఆఫీస్లో లేదా ఇంట్లో టేబిల్ మీద లేదంటే షో కేస్ లో వస్తువులను యధా స్థానం లో, అంటే ఒక్క ఇంచ్ తేడా లేకుండా, సర్దే వాళ్ళని చూసారా? చెడు శకునం కనిపిస్తే పది సార్లు నోట్లో దేవుడు పేరు చెప్పుకొంటూ ముందుకు వెళ్ళే వాళ్ళని చూసారా? వస్తువులను పది సార్లు లెక్కపెట్టడం... మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటనే అనుకోవడం.... ఇవన్నీ రిపిటిటివ్ బిహేవియర్స్. ఇక్కడే నేను ఒక కన్ఫెషన్ చేయాలి. చేతులకి మన కళ్ళకి కనబడని మట్టి బ్యాక్టీరియా ఉంటుందని భయం, అనుమానం తో నేను ఒకటికి రెండు కాదు అంత కంటే ఎక్కువ సార్లు చేతులు శుభ్రంగా కడుక్కొనేదాన్ని. అంతే కాదు పిల్లలకి కూడ అలాగే చెప్పేదాన్ని, ఎపుడైతే అదో డిసార్డర్ అని తెలుసుకొన్నానో అపుడు తగ్గించాననుకోండి.ఇంతకీ చేసినదే పదే పదే చేసే డిసార్డర్ నే OCD అంటారు. ఇలాంటి థీమ్ మీద సినిమాలు కూడా చూసే ఉంటారు.  నేను చెప్పిన ఈ రిపిటిటివ్ బెహేవియర్స్ కొన్ని మాత్రమే. ఇంకా వ...