ఈ పోస్ట్ స్త్రీల ఆరోగ్య సంబంధ ముఖ్యమైన సమస్య గురించి.. అదే హిస్టరెక్టమీ లేదా గర్భాశయన్ని తొలగించే శస్త్ర చికిత్స. ఈ మధ్య ఎంతో మంది చెప్తుంటే విన్నాను. గర్బ సంచి తీయించేశానండి అంటూ. మనకి మనం తీయించుకోవాలనుకోవడం కంటే కూడా ఒక వైద్య కారణంగా గర్భ సంచి తొలగించుకోమని వైద్య సలహా మేరకు తీయించుకోవడం ఈ రెండు వేర్వేరు. ఏది ఏమైనా హిస్టరెక్టమీ కేసులు నేడు ఎక్కువగా చూస్తున్నాం. గర్భధారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది గర్భసంచి. బిడ్డను తొమ్మిది నెలలు భద్రంగా పొదవి పట్టుకొని ఆ తరువాత బిడ్డ జన్మనిచ్చేదాకా - గర్భ సంచి అనే కండరం అనేక విధులను పోషిస్తుంది. వయసు పెరిగే కొద్ది, స్త్రీల శరీరాల్లో వచ్చే మార్పుల కారణంగా గర్భ సంచి ఆరోగ్యం కూడా కుంటు పడుతుంది. గర్భ సంచిలో ఏర్పడే కణితులు లేదా గడ్డలు, గర్భ సంచి ఉండవల్సిన స్థానం నుంచి జారి మూత్ర మార్గం వద్దకు వచ్చేయడం, గర్భసంచి లో లేదా ముఖ ద్వారం అంటే సర్విక్స్ , ఓవరీలు అంటే అండాశయాల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు, ఎండోమెట్రియాసిస్ - అంటే గర్భాశయ పొర, వెలుపల భాగాల మీదకు పెరగడం ఫలితంగా కలిగే ఇబ్బందులు, మోతాదు మించిన వజైనల్ బ్లీడింగ్ సమ...