"డియర్ లేడీస్... పీరియడ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్.. కానీ ఆ మూడు లేదా ఐదు లేదా అంత కంటే ఎక్కువ రోజులు పడే ఇబ్బందులు మనకే తెలుస్తాయి. అంత కంటే ఎక్కువ అని ఎందుకు అన్నాను అంటే .. రెగ్యులర్ గా పీరియడ్ సైకిల్స్ రాని వాళ్ళు అంటే రెండు మూడు నెలలకి వచ్చే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందరో. అందుకే ఈ పోస్ట్ లో పి. ఎం.ఎస్ లేదా ప్రీ మెన్స్ట్రూయల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. ముందు నా సంగతే చెప్తాను. అంతకు ముందు కొన్నేళ్లుగా లేని కొన్ని లక్షణాలు ఈ మధ్య ఎక్స్పీరిఎన్స్ చేశాను. పీరియడ్ వచ్చే వారం రోజుల ముందు నుంచి చాలా స్ట్రెస్ ఫుల్ గా చికాకుగా ఉంటుంది. అంతే కాదు, ఇంకో ఒకటో రెండు రోజుల్లో సైకిల్ మొదలు అవుతుంది అనగానే, కోపంగా విరక్తిగా ఉండేది. ఒక్కోసారి నిస్సహాయంగా ఏడుపొచ్చినట్టుగా అనిపించి ఏడిచిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడించిన విసుగ్గా ఉండేది, ఇలాంటి లక్షణాలన్నీ పీరియడ్ మొదలు కాగానే మాయమై పోయేవి. ఎపుడైనా సమస్య వస్తే కదా మనం వాటి మూలం గురించి ఆలోచించేది. నేను హెల్త్ జర్నలిస్ట్ గా ఉండడం వల్లనేమో ఇంతకు ముందే నేను ఎదుర్కొన్న సమస్య గురించి డాక్టర్స్ తో ఇంటర్వ్యూస్ చేయడం కారణంగా నా లక్షణాలని పి.ఎం. ఎస్ కి లింక్ చేయగలిగా.
ఇపుడు మీకు పి ఎం ఎస్ గురించి అందులో భాగంగా ఎదురయ్యే స్పెక్ట్రమ్ ఆఫ్ సింప్టంస్ గురించి చెప్తాను. పి ఎం ఎస్ లో ముఖ్యమైన లక్షణాలు : చిరాగ్గా ఉండడం, బ్లోటింగ్ అంటే కడుపుబ్బరంగా ఆకలి లేకుండా తిన్నది అరగనట్టు ఉండడం,అలసట నిస్సత్తువ. ఫిసికల్ యాక్టివిటీ లెవెల్, లైఫ్ స్టైల్ బట్టి ఆయా స్త్రీలలో ఈ లక్షణాల ఉదృతం ఒక్కో రకంగా ఉండొచ్చు. అంతే కాదు వారి ఎమోషనల్ స్ట్రెంగ్త్ బట్టి కూడా మార్పు ఉండొచ్చు. ఇవి కొందరిలో పీరియడ్ ఆరంభం అయ్యే పది రోజుల ముందు నుంచి ఉంటే మరికొందరిలో ఐదారు రోజుల ముందు నుంచి మొదలు కావచ్చు. ఒక బ్రాకెట్ లో ఇవి వీరికి అని చెప్పినట్టు ఖచ్చితంగా మనం చెప్పలేకపోయిన పి ఎం ఎస్ దాదాపు 85 శాతం నెలసరి అయ్యే మహిళలలో చూడచ్చు. మీకింకో అశ్చ్యర్య కరమైన విషయం చెప్పాలి. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఉంటుందేమో అనుకొంటారేమో, అలాగే నేను అనుకొనేదాన్ని, కానీ కొందరు గైనికాలజిస్ట్స్ తో మాట్లాడక తెలిసింది ఏంటంటే ఇది యంగ్ గల్స్ నుంచి మిడిల్ ఏజ్ నలభైలు ఇలా ఏ వయసు స్త్రీలలో నైనా రావచ్చు. ఇంతకీ ఈ సమస్య వెనుక కారణం ఏంటి అని ఖచ్చితంగా తెలియరాలేదు కానీ హార్మోన్స్ వల్లనే ఇలాంటి లక్షణాలు మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇంకొన్ని ఫిజికల్ సింప్టంస్ గురించి మీకు చెప్పాలి. మొన్న నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్తుంటే నేను చాలా సర్ప్రైస్ అయ్యాను. పీరియడ్ వచ్చే వారం రోజుల ముందు నుంచి బ్రెస్ట్ లో ఎంత విపరీతమైన నొప్పిగా ఉంటుందో అని ఆవిడ తన భాధ ని వ్యక్తం చేస్తుంటే.. అయ్యో అనుకున్నాను. కనీసం ఒక్క లేయర్ బట్టలు కూడా మోయలేనంత బాధ ఉంటుందిట. ఇంకొందరి అనుభవాలు చెప్తూ ఉంటే.. ఫుడ్ క్రెవింగ్స్ అంటే ఏదో తినాలనే కోరిక. స్వీట్స్, బజ్జీలు ఇలా ఒక స్పెసిఫిక్ ఫుడ్ తినాలనే తపన కొందరిలో ఉంటుంది ఇదీ కూడా పి ఎం ఎస్ లక్షణమే. సాధరణంగా ప్రెగ్నెన్సిలో ఉండే ఆ క్రేవింగ్ లాంటి దన్నమాట. ఇక్కడే ఒక్క విషయం చెప్పాలి. ప్రెగ్నెన్సి కోసం ప్రయత్నం చేస్తున్న వారు పి ఎం ఎస్ లక్షణాలతో కొంత కన్ఫ్యూస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దాదాపు ప్రెగ్నెన్సి కన్ఫర్మ్ అయ్యే ముందు కొందరు ఇలాంటి లక్షణాలనే ఎక్స్పీరిఎన్స్ చేస్తూ ఉంటారు.
వీటన్నిటికి మించిన కొన్ని లక్షణాలు ప్రీ మెన్స్ట్రూయల్ సిండ్రోమ్ లో ఆడవాళ్లని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవే డిప్రెషన్ .. కోపం. నా అనుభవాన్ని కోపం వరకు సరిపెట్టుకొంటే ... డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఎంత ఉన్నాయని, డాక్టర్స్ ని ఇంటర్వ్యూస్ సందర్భంగా అడిగితే .. బోలెడు మంది అని తెలుసుకొన్నాక.. ప్రతి స్త్రీ కూడా పి ఎం ఎస్ గురించి అవగాహన కలిగి ఉండాలని అనిపించింది. ఎందుకంటే మన తరహా సమాజం, లైఫ్ స్టైల్స్ లో ఆడవాళ్ళకి ఒత్తిడి మామూలే కానీ అది కట్టలు తెంచుకొనే పరిస్థితులు కూడా తరచూ ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పి ఎం ఎస్ లో భాగంగా. పిల్లల మీద అనవసరంగా చేయి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళతో గొడవపడడం, అత్త మామలపై కోపగించుకోవడం, ఇలా మనం ఎన్ని చూడడం లేదు. ఇందుకు చికిత్స తీసుకొంటున్న వారు యే కొద్ది మంది మాత్రమే. ఎక్కువ శాతం వీటిని భరిస్తూ, ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీటితో పాటు నిద్ర పట్టకపోవడం, ఆకలి మందగించడం, సోషల్ విత్ డ్రాయల్ అంటే, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండాలనుకోవడం, పని మీద ఆసక్తి తగ్గిపోవడం ఇవన్నీ కూడా పి ఎం ఎస్ లో భాగమే. ఇక ఇతర ఫిజికల్ సింప్టంస్ కి వస్తే... పాదాల్లో వాపు, జాయింట్ పెయిన్స్, తలనొప్పి, నడుము పొత్తి కడుపు నొప్పి, మల బద్ధకం లేదా విరేచనాలు ఏవైనా కావచ్చు.
పి ఎం ఎస్ గా పిలువబడే సాధారణ సమస్య ఎపుడైతే మరింత తీవ్రతరం అవుతుందో, లక్షణాలు ముఖ్యంగా డిప్రెషన్ , కట్టలు తెచ్చుకొనే కోపం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఇవన్నీ బాగా ఎక్కువగా రెగ్యులర్ గా కనిపిస్తుంటే అది పి ఎం డి డి ( ప్రీ మెన్స్ ట్రూయల్ డిస్పోరిక్ డిసార్డర్ ) అంటారు. ఇందుకు ట్రీట్మెంట్ తప్పనిసరి. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళ సపోర్ట్ పి ఎం ఎస్ తో బాధపడే స్త్రీలకి అవసరం. ముఖ్యంగా వైఫ్ కి ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఆమె పరిస్థితి అర్ధం చేసుకొని అందుకు తగ్గట్టు వాళ్ళు నడుచుకోవాలి. మన దేశంలో సమస్య అంతా ఇక్కడే. పీరియడ్ అనేది ఏదో స్త్రీల సమస్య గా భావిస్తారు మగవాళ్ళు. స్త్రీలను కూడా ఒకందుకు ఇందుకు భాధ్యులు అంటాను నేను. అది కేవలం వారి సమస్య గా వారు భావిస్తూ ఎపుడైతే
పి ఎం ఎస్ ద్వారా ఇతరులు కూడా తమ చికాకు కోపానికి టార్గెట్ అవుతున్నారని తెలుసుకొంటారో అపుడు నిస్సహాయంగా ఉంటారు. అందుకే తాను లోనవుతున్న సమస్య గురించి ఇంట్లో వాళ్ళకి తెలియ చేయడం వల్ల కొంత లాభం ఉంది. అందుకే ఈ పోస్ట్ ని ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు ఎక్కువగా చదవాలని నా కోరిక."
Comments
Post a Comment