చేసిన పనినే పదే పదే చేస్తున్నారా? ఒకే ఆలోచన మనసుని వేధిస్తోందా ?
తాళం వేసి అది సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసే వాళ్ళని చూసారా? లేదంటే తాళం వేసి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తాళం లాగి చూసే వాళ్ళని? రోజుకు పదులు ఇరవైల సార్లు చేతులు కాళ్ళు కడుక్కోనే వాళ్లని? ఆఫీస్లో లేదా ఇంట్లో టేబిల్ మీద లేదంటే షో కేస్ లో వస్తువులను యధా స్థానం లో, అంటే ఒక్క ఇంచ్ తేడా లేకుండా, సర్దే వాళ్ళని చూసారా? చెడు శకునం కనిపిస్తే పది సార్లు నోట్లో దేవుడు పేరు చెప్పుకొంటూ ముందుకు వెళ్ళే వాళ్ళని చూసారా? వస్తువులను పది సార్లు లెక్కపెట్టడం... మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటనే అనుకోవడం.... ఇవన్నీ రిపిటిటివ్ బిహేవియర్స్. ఇక్కడే నేను ఒక కన్ఫెషన్ చేయాలి. చేతులకి మన కళ్ళకి కనబడని మట్టి బ్యాక్టీరియా ఉంటుందని భయం, అనుమానం తో నేను ఒకటికి రెండు కాదు అంత కంటే ఎక్కువ సార్లు చేతులు శుభ్రంగా కడుక్కొనేదాన్ని. అంతే కాదు పిల్లలకి కూడ అలాగే చెప్పేదాన్ని, ఎపుడైతే అదో డిసార్డర్ అని తెలుసుకొన్నానో అపుడు తగ్గించాననుకోండి.ఇంతకీ చేసినదే పదే పదే చేసే డిసార్డర్ నే OCD అంటారు. ఇలాంటి థీమ్ మీద సినిమాలు కూడా చూసే ఉంటారు. నేను చెప్పిన ఈ రిపిటిటివ్ బెహేవియర్స్ కొన్ని మాత్రమే. ఇంకా విచిత్రమైనవి చాలానే ఉన్నాయి. నాకు బాగా గుర్తు మా తాతమ్మ ఎప్పుడో పోయిన వాళ్ళని గుర్తు చేసుకొని, వాళ్ళు పోయినపుడు తాను స్నానం చేసిందా లేదా అని బోలెడు సార్లు మమ్మల్ని అడుగుతూ ఉండేది. మా అంకుల్ అమెరికా లో ఉంటారు. ఆయన బాత్రూమ్ కి వెళ్ళేటపుడు డోర్ నాబ్ చేత్తో కాకుండా టిష్యూ పేపర్ తో పట్టుకొని తీస్తారు. దాని మీద ఉంటే జెర్మ్శ్ ఆయనకి అంటకుండా. ఇంకో పెద్దమనిషి ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్తే వాళ్ళకి ఏదో ఘోర ప్రమాదం జరిగినట్టు ఊహించుకొని , వాళ్ళకి ఫోన్ చేసి పలు సార్లు వారు బాగోగులు కనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆబ్సెసివ్ థాట్స్, బిహేవియర్స్ కలబోస్తే ఓ సి డి. ఇది కొద్ది మందిలో నలుగురు గమనించే బిహేవియర్ గా ఉంటే మరికొందరిలో వ్యాధి గా ముదిరి వైద్యం అవసరం పడుతుంది. ఎపుడైతే ఈ తరహా బిహేవియర్ లేదా ఆలోచనల వల్ల లైఫ్ క్వాలిటీ తగ్గిపోతోందో అపుడు దానికి ట్రీట్మెంట్ తప్పనిసరి. కొందరిలో కొంత కౌన్సెల్లింగ్ తో సమస్య పరిష్కారం అయితే మరికొందరికి మందులు బెహేవియర్ థెరపీ అవసరం కావచ్చు. అందుకే మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా ఓ సి డి ఉంటే తప్పనిసరిగా కండిషన్ తీవ్రత మేరకు సహాయం తీసుకోవాలి.
ఈ పోస్ట్ స్త్రీల ఆరోగ్య సంబంధ ముఖ్యమైన సమస్య గురించి.. అదే హిస్టరెక్టమీ లేదా గర్భాశయన్ని తొలగించే శస్త్ర చికిత్స. ఈ మధ్య ఎంతో మంది చెప్తుంటే విన్నాను. గర్బ సంచి తీయించేశానండి అంటూ. మనకి మనం తీయించుకోవాలనుకోవడం కంటే కూడా ఒక వైద్య కారణంగా గర్భ సంచి తొలగించుకోమని వైద్య సలహా మేరకు తీయించుకోవడం ఈ రెండు వేర్వేరు. ఏది ఏమైనా హిస్టరెక్టమీ కేసులు నేడు ఎక్కువగా చూస్తున్నాం. గర్భధారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది గర్భసంచి. బిడ్డను తొమ్మిది నెలలు భద్రంగా పొదవి పట్టుకొని ఆ తరువాత బిడ్డ జన్మనిచ్చేదాకా - గర్భ సంచి అనే కండరం అనేక విధులను పోషిస్తుంది. వయసు పెరిగే కొద్ది, స్త్రీల శరీరాల్లో వచ్చే మార్పుల కారణంగా గర్భ సంచి ఆరోగ్యం కూడా కుంటు పడుతుంది. గర్భ సంచిలో ఏర్పడే కణితులు లేదా గడ్డలు, గర్భ సంచి ఉండవల్సిన స్థానం నుంచి జారి మూత్ర మార్గం వద్దకు వచ్చేయడం, గర్భసంచి లో లేదా ముఖ ద్వారం అంటే సర్విక్స్ , ఓవరీలు అంటే అండాశయాల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు, ఎండోమెట్రియాసిస్ - అంటే గర్భాశయ పొర, వెలుపల భాగాల మీదకు పెరగడం ఫలితంగా కలిగే ఇబ్బందులు, మోతాదు మించిన వజైనల్ బ్లీడింగ్ సమ...
నాకు తెలిసిన ఒక మిత్రుడి సంగతి చెప్తాను. శ్రీను, ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది. ఒక స్కూల్ లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తుంటాడు. భార్య, అయిదారేళ్ళ కొడుకు. స్మాల్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ. నాకు తెలిసి శ్రీనుకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. చురుగ్గా ఉండేవాడు.తన పెర్శనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉండేది. ఒకటో రెండో సందర్భాల్లో తల నొప్పిగా ఉందంటూ పెయిన్ కిల్లర్ మాత్రలు టక్కున మింగడం చూశాను, తల నొప్పి ఎప్పటి నుంచి శ్రీను నీకు అని అడిగాను. ఈ మధ్య తరచూ వస్తోంది కళ్ల ప్రాబ్లెమ్ ఏమో అని ఐ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను, సైట్ మామూలుగానే ఉంది అన్నాడు. మరి జాబ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉందా అన్నాను.. అలా ఏమి లేదే నేను చేసేది ఆర్ట్ టీచర్ జాబ్ అదీ కూడా చిన్న పిల్లలకి, అందులో స్ట్రెస్ ఏముంటుంది అన్నాడు. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. నేను ఆ తర్వాత పెద్దగా ఆ విషయం గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఇది రెండేళ్ల క్రితం మాట... మళ్ళీ మొన్నెపుడో కలిసినపు అడిగా తల నొప్పి మళ్ళీ వస్తోందా అని. చాలా సార్లు వచ్చింది. ఒక్కో సారి బైక్ మీద వెళ్ళేటపుడు బ్లాక్ అవుట్ అయిపోతుంది అని చెప్పాడు. మరో పెద్ద బాంబు లాంటి నిజాన్ని కూడా చెప్పాడు....
Comments
Post a Comment