Skip to main content

పెయిన్ కిల్లర్స్ అతిగా వేస్కుంటున్నారా?


నాకు తెలిసిన ఒక మిత్రుడి సంగతి చెప్తాను. శ్రీను, ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది. ఒక స్కూల్ లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తుంటాడు. భార్య, అయిదారేళ్ళ కొడుకు. స్మాల్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ. నాకు తెలిసి శ్రీనుకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. చురుగ్గా ఉండేవాడు.తన పెర్శనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉండేది. ఒకటో రెండో సందర్భాల్లో తల నొప్పిగా ఉందంటూ పెయిన్ కిల్లర్ మాత్రలు టక్కున మింగడం చూశాను, తల నొప్పి ఎప్పటి నుంచి శ్రీను నీకు అని అడిగాను. ఈ మధ్య తరచూ వస్తోంది కళ్ల  ప్రాబ్లెమ్ ఏమో అని ఐ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను, సైట్ మామూలుగానే ఉంది అన్నాడు. మరి జాబ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉందా అన్నాను.. అలా ఏమి లేదే నేను చేసేది ఆర్ట్ టీచర్ జాబ్ అదీ కూడా చిన్న పిల్లలకి, అందులో స్ట్రెస్ ఏముంటుంది అన్నాడు. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. నేను ఆ తర్వాత పెద్దగా ఆ విషయం గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఇది రెండేళ్ల క్రితం మాట... మళ్ళీ మొన్నెపుడో కలిసినపు అడిగా తల నొప్పి మళ్ళీ వస్తోందా అని. చాలా సార్లు వచ్చింది. ఒక్కో సారి బైక్ మీద వెళ్ళేటపుడు బ్లాక్ అవుట్ అయిపోతుంది అని చెప్పాడు. మరో పెద్ద బాంబు లాంటి నిజాన్ని కూడా చెప్పాడు. ఒక సారి ఇలానే బ్లాక్ అవుట్ అయి వాంతి అయిందని వెళ్ళి చెక్ చేయించుకొంటే హై బీపీ ఉందని ఇన్నేళ్లు తల నొప్పికి కారణం కూడా అదే అని చెప్పాడు. తన కేస్ హిస్టరీ తెలుసుకొన్న డాక్టర్స్ అన్నీ టెస్ట్స్ చేసి చూడగా కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయని ఇదంతా కూడా తాను విచ్చల విడిగా వైద్య సలహా లేకుండా వాడిన హై పవర్ పెయిన్ కిల్లర్స్ కారణంగానే అని డాక్టర్స్ చెప్పారు. కిడ్నీలు ఫెయిల్ అయ్యే వయసా చెప్పండి అతనిది? ఫ్యూచర్ అంతా కూడా అగమ్య గోచరమే కదా.. ప్రస్తుతానికి రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకొంటున్నాడు. తన జీతానికి మించిన ఖర్చు. వైఫ్ పిల్లవాడి భాద్యత తన మీదనే ఉంది. తల నొప్పికి కారణం తెలుసుకోకుండా అలా వందల కొద్ది ట్యాబ్లెట్స్ మింగుతూ పోయావు, కాస్తో కూస్తో చదువు కొన్నావు కదా అని నేనంటే.. నా విధి నా తల రాత అంటూ ఏవో చెప్పాడు. కిడ్నీ దాతలు ముందుకు వస్తే అతనికి మరో కిడ్నీ పెడతారు సరే కానీ అసలు ఈ పరిస్తితి రాకుండా ఉంటే ఎంత బావుండేది.. మనలో ఎంతో మంది కాస్త కూస్తా నొప్పిగా ఉంటే పెయిన్ కిల్లర్స్ అవలీలగా వేస్కుంటూ ఉంటారు. ఇదే విధంగా ఎక్కువ కాలం పాటు వేసుకొంటే దాని ప్రభావం డైరెక్ట్ గా కిడ్నీల మీద పడుతుంది. ముఖ్యంగా కొన్ని నొప్పి మందులను తరచూ వాడకూడదు అని వైద్యులు చెప్తున్నారు. ఓవర్ ద కౌంటర్ గా అంటే  మెడికల్ షాప్ కెళ్ళి వాళ్ళ సలహా మేరకు కూడా మందులు తీసుకొని వేస్కోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. కొన్ని సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి వాటిని ఎపుడైనా వాడుకోవచ్చు.  ఇక అప్పటికే ఏవైనా దీర్ఘ కాల ఆరోగ్య సమస్యలకు నొప్పి మందులు వాడుతుంటే వాటి తాలూకు కాంప్లికేషన్స్ డాక్టర్ వద్ద అడిగి తెలుసుకోవాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కిడ్నీలు సైలెంట్ గా డ్యామేజ్ అవుతాయని మీకు తెలుసా?ఫెయిల్ అయ్యే క్షణం దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి లాగుతూ ఉంటాయి. టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే .. పెయిన్ కిల్లర్స్ ఇష్టానుసారం వైద్య సలహా లేకుండా వాడకూడదు. మిమ్మల్ని ఏదైనా పెయిన్ కొద్ది రోజుల మించి ఇబ్బంది పెడుతూ ఉంటే డాక్టర్ అడ్వైస్ తప్పనిసరి. 

Comments

Popular posts from this blog

గర్భసంచి తొలగింపు ఆపరేషన్ హిస్టరెక్టమీ ఎపుడు అవసరం?

ఈ పోస్ట్ స్త్రీల ఆరోగ్య సంబంధ ముఖ్యమైన సమస్య గురించి.. అదే  హిస్టరెక్టమీ లేదా గర్భాశయన్ని తొలగించే శస్త్ర చికిత్స. ఈ మధ్య ఎంతో మంది చెప్తుంటే విన్నాను. గర్బ సంచి తీయించేశానండి అంటూ. మనకి మనం తీయించుకోవాలనుకోవడం కంటే కూడా ఒక వైద్య కారణంగా గర్భ సంచి తొలగించుకోమని వైద్య సలహా మేరకు తీయించుకోవడం  ఈ రెండు వేర్వేరు. ఏది ఏమైనా హిస్టరెక్టమీ కేసులు నేడు ఎక్కువగా చూస్తున్నాం. గర్భధారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది గర్భసంచి. బిడ్డను తొమ్మిది నెలలు భద్రంగా పొదవి పట్టుకొని ఆ తరువాత బిడ్డ జన్మనిచ్చేదాకా - గర్భ సంచి అనే కండరం అనేక  విధులను పోషిస్తుంది.  వయసు పెరిగే కొద్ది, స్త్రీల శరీరాల్లో వచ్చే మార్పుల కారణంగా గర్భ సంచి ఆరోగ్యం కూడా కుంటు పడుతుంది. గర్భ సంచిలో ఏర్పడే కణితులు లేదా గడ్డలు, గర్భ సంచి ఉండవల్సిన స్థానం నుంచి జారి మూత్ర మార్గం వద్దకు వచ్చేయడం, గర్భసంచి లో లేదా ముఖ ద్వారం అంటే సర్విక్స్ , ఓవరీలు  అంటే అండాశయాల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు, ఎండోమెట్రియాసిస్ - అంటే గర్భాశయ పొర, వెలుపల భాగాల మీదకు పెరగడం ఫలితంగా కలిగే ఇబ్బందులు, మోతాదు మించిన వజైనల్ బ్లీడింగ్ సమ...

చేసిన పనినే పదే పదే చేస్తున్నారా? ఒకే ఆలోచన మనసుని వేధిస్తోందా ?

తాళం వేసి అది సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసే వాళ్ళని చూసారా? లేదంటే తాళం వేసి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తాళం లాగి చూసే వాళ్ళని? రోజుకు పదులు ఇరవైల సార్లు చేతులు కాళ్ళు కడుక్కోనే వాళ్లని? ఆఫీస్లో లేదా ఇంట్లో టేబిల్ మీద లేదంటే షో కేస్ లో వస్తువులను యధా స్థానం లో, అంటే ఒక్క ఇంచ్ తేడా లేకుండా, సర్దే వాళ్ళని చూసారా? చెడు శకునం కనిపిస్తే పది సార్లు నోట్లో దేవుడు పేరు చెప్పుకొంటూ ముందుకు వెళ్ళే వాళ్ళని చూసారా? వస్తువులను పది సార్లు లెక్కపెట్టడం... మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటనే అనుకోవడం.... ఇవన్నీ రిపిటిటివ్ బిహేవియర్స్. ఇక్కడే నేను ఒక కన్ఫెషన్ చేయాలి. చేతులకి మన కళ్ళకి కనబడని మట్టి బ్యాక్టీరియా ఉంటుందని భయం, అనుమానం తో నేను ఒకటికి రెండు కాదు అంత కంటే ఎక్కువ సార్లు చేతులు శుభ్రంగా కడుక్కొనేదాన్ని. అంతే కాదు పిల్లలకి కూడ అలాగే చెప్పేదాన్ని, ఎపుడైతే అదో డిసార్డర్ అని తెలుసుకొన్నానో అపుడు తగ్గించాననుకోండి.ఇంతకీ చేసినదే పదే పదే చేసే డిసార్డర్ నే OCD అంటారు. ఇలాంటి థీమ్ మీద సినిమాలు కూడా చూసే ఉంటారు.  నేను చెప్పిన ఈ రిపిటిటివ్ బెహేవియర్స్ కొన్ని మాత్రమే. ఇంకా వ...